కరెంట్ అఫైర్స్డైలీ న్యూస్బిట్ బ్యాంక్

డాకింగ్ అంటే ఏమిటి? వార్తల్లో ఎందుకు ఉంది?

కరెంట్ అఫైర్స్ 17-01-2024
(ఉద్యోగ సాధనలో కరెంట్ అఫైర్స్ పాత్ర కీలకం. అన్ని సబ్జెక్టుల్లో సమకాలిన అంశాలతో అప్ డేట్ కావడం తప్పనిసరి. దీనికి దినపత్రికలు రోజు చదవడం ఎంతో మేలు చేస్తుంది. అయితే సమయభావం వల్ల అభ్యర్థులు పత్రికలను చదవాలంటే ఇబ్బంది పడతారు. అందువల్ల మీ కోసం ప్రతీ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చే అంశాలను కరెంట్ అఫైర్స్ రూపంలో అందిస్తున్నాం. దీని ద్వారా అభ్యర్థులు పత్రికలు చదవకుండానే.. మేం అందించే కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. వీటితో పాటు ఏదైనా మంత్లీ మ్యాగజైన్ ఫాలో కావడం కూడా మీ ప్రిపరేషన్ ను బలోపేతం చేస్తుంది.)

  1. డాకింగ్ అంటే ఏమిటి? (what is docking) వార్తల్లో ఎందుకు ఉంది?
    జ: భూ కక్ష్యలో రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియనే ‘డాకింగ్’ అంటారు. దీనిని ఇస్రో జనవరి 16న విజయవంతంగా చేపట్టింది. స్పేడెక్స్ ప్రాజెక్టు కింద ఎస్డీఎక్స్(ఛేజర్), ఎస్డీఎక్స్ 02(టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను డిసెంబర్ 30న 475 కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార కక్ష్యలో ఇస్రో ప్రవేశపెట్టింది. మొదట వాటి మధ్య దూరం 20 కిలో మీటర్లుగా ఉండేది. ఆ తర్వాత వాటి మధ్య దూరాన్ని సైంటిస్టులు తగ్గించుకుంటూ వచ్చారు. డాకింగ్ కు మూడు సార్లు ప్రయత్నించగా పలు కారణాల వల్ల చివరి దశలో విరమించుకోవాల్సి వచ్చింది. చివరకు జనవరి 16న వీటిని విజయవంతంగా అనుసంధానించారు.
  2. పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధులపై మూడు నెలల్లోపు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది?
    జ: కేశం మేఘాచంద్ర కేసు
  3. నైపుణ్యాల సన్నద్ధతలో భారత్ స్థానం ఎంత?
    జ: కృత్తిమ మేథ, డిజిటల్, హరిత రంగాలు సహా భవిష్యత్ లో అత్యధిక డిమాండ్ కలిగిన ఉద్యోగ మార్కెట్ కు సంబంధించి నైపుణ్యాల సన్నద్ధతల్లో భారత్ రెండో ర్యాంకు సాధించింది. క్యూఎస్(క్వాక్వరెల్లి సైమండ్స్) సంస్థ తన ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్-2025లో వెల్లడించింది. ఈ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తోంది. తొలి స్థానంలో అమెరికా ఉంది.
  4. న్యూగ్లెన్ రాకెట్ ను ఏ దేశం నుంచి ప్రయోగించారు?
    జ: అమెరికాకు చెందిన బ్లూ అరిజన్ సంస్థ జనవరి 16న ఈ భారీ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ఒక ప్రోటో టైప్ ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి పంపింది. దీన్ని ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. బ్లూ అరిజన్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందింది.
  5. భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్ ఎవరు?
    జ: మన దేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

6.థాయ్ లాండ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఏ భారత నటుడు నియమితులయ్యారు?
జ: సోనూసూద్. ఆ దేశ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది.

  1. భారత సేవా రంగం ఎగుమతుల్లో ఏ ఉత్పత్తుల వాటా ఎక్కువ?
    జ: భారత సేవా రంగం ఎగుమతుల్లో సాఫ్ట్ వేర్ సర్వీసులు ఎగుమతులు ఎక్కువ. అవి 49శాతంగా ఉన్నాయి. ఇతర రంగాలను చూస్తే.. వ్యాపార సంబంధ సేవలు 23శాతం, రవాణా సంబంధ సేవలు 11, పర్యాటక సేవలు 4, ఆర్థిక సేవలు 2, బీమా సంబంధ సేవలు 1, సమాచార సంబంధ సేవలు 1, ఇతర సేవలు 8శాతంగా ఉన్నాయి.
  2. బనకచర్ల ప్రాజెక్టును ఏ రాష్ట్రం చేపడుతోంది?
    జ: ఆంధ్రప్రదేశ్
  3. యునిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
    జ: డిసెంబర్ 11

10.యునెస్కో ఏ భారతీయ ఆలయాన్ని దాని పరిరక్షణ కోసం 2023 అవార్డు కోసం ఎంపిక చేసింది.
జ: అబత్ శహయేశ్వర ఆలయం

11.సుబారు టెలిస్కోప్ ను ఏ దేశం నిర్వహిస్తోంది?
జ: జపాన్

  1. అధునాతన దీర్ఘశ్రేణి రాడార్ వ్యవస్థ కోసం 4 బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేయడానికి ఏ రెండు దేశాలు సిద్ధమవుతున్నాయి?
    జ: ఇండియా, రష్యా
  2. హర్మీత్ థిల్లాన్ ను అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఏ పదవికి నామినేట్ చేశారు?
    జ: అసిస్టెంట్ అటార్నీ జనరల్ ఫర్ సివిల్ రైట్స్
  3. బ్లూటూత్ లో ఎనర్జీ గేట్ వే, నోడ్ సిస్టమ్ పేరుతో కొత్త బ్లూటూత్ ను ఏ ఐఐటీ అభివృద్ధి పరిచింది?
    జ: ఐఐటీ రోపర్
  4. 20వ ఆసియా మహిళల హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్ 2024ను ఏ జట్టు గెలుచుకుంది? భారత్ ఏ స్థానంలో నిలిచింది?
    జ: జపాన్; 6వ స్థానం
  5. హెన్లే పాస్ పోర్ట్ ఇండెక్స్-2025 నివేదికలో బలమైన పాస్ పోర్ట్ కలిగిన దేశాలు ఏవి? భారత్ స్థానం ఎంత?
    జ: 1- సింగపూర్
    2- జపాన్
    3- ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫిన్ లాండ్, దక్షిణ కొరియా

భారత్ ర్యాంకు 85. 2024లో 80వ స్థానంలో ఉంది. ప్రస్తుతం 5 ర్యాంకులు దిగజారింది.

  1. భారత్ లో డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ను పరిచయం చేసింది ఎవరు?
    జ: మన దేశంలో ఈ పద్ధతిని మొదటిసారిగా ఉపయోగించి, వ్యాప్తిలోకి తెచ్చింది హైదరాబాద్ లోని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ లాల్జీసింగ్. ఈయన కేరళలోని న్యాయస్థానంలో దాఖలైన అత్యాచార కేసులో దోషిని గుర్తించడంలో ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ పరీక్ష జరిపే ‘సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్’ సంస్థను హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేశారు. అయితే ప్రపంచంలో మొదటిసారిగా ఈ పద్ధతిని ఇంగ్లాండ్ లోని లీచెస్టర్ యూనివర్సిటీకి చెందిన అలెక్ జెఫ్రీస్ 1985లో రూపొందించారు.
  2. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో ఏం సేకరిస్తారు?
    జ: నేరం జరిగిన ప్రదేశంలో లభించే రక్తం(ముఖ్యంగా తెల్లరక్త కణాలు), తల వెంట్రుకల మూలాలు, వీర్యం, యోని స్రావం, చర్మంలోని కొంత భాగం లేదా చాలా కాలం కింద పూడ్చివేసిన శవం నుంచి ఎముకల నుంచి డీఎన్ఏను సేకరిస్తారు.
  3. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ప్రయోజనాలు ఏవి?
    జ: ఫోరెన్సిక్ విశ్లేషణ ద్వారా దొంగలు, హంతకులు, అత్యాచారం చేసిన వారిని గుర్తించవచ్చు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నిర్ధారించవచ్చు. అంతరించి పోయే జీవజాతుల సంరక్షణకు దీన్ని ఉపయోగించవచ్చు. మెడికో, లీగల్ వివాదాల పరిష్కారాల్లో దీని ద్వారా మాతృత్వం, పితృత్వాన్ని కచ్చితంగా కనుక్కోవచ్చు. జంతువులు, మానవుల వర్గ వికాస చరిత్రను తెలుసుకోవచ్చు.
  4. దేశంలో ఎమర్జెన్సీ విధించి దేశంలో కల్లోలానికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఏ దేశ అధ్యక్షుడు అభిశంసనకు గురయ్యారు?
    జ: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *